Karnataka: ఏపీ బాటలో కర్ణాటక: రాజధాని వికేంద్రీకరణకు అసెంబ్లీ తీర్మానం
- బెంగళూరు నుంచి కొన్ని కార్యాలయాల తరలింపు
- ఉత్తర కర్ణాటకకు అందుబాటులో ఉంచాలని నిర్ణయం
- వైసీపీ ప్రభుత్వానికి సరికొత్త ఉత్సాహం
రాజధాని వికేంద్రీకరణకు కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బెంగళూరు నుంచి కొన్ని కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లుకు అక్కడి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మూడు రాజధానుల కోసం ప్రయత్నిస్తున్న ఏపీ ప్రభుత్వానికి సరికొత్త ఉత్సాహాన్నిచ్చే అంశమిది.
అమరావతిలో లెజిస్లేటివ్, విశాఖలో ఎగ్జిక్యూటివ్, కర్నూల్ లో జ్యుడీషియల్ రాజధానుల ఏర్పాటుకు ఏపీ అసెంబ్లీ ఇప్పటికే తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రతిపాదనలను విపక్ష టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పరిస్థితుల్లో కర్ణాటకలో బీజేపీ నిర్ణయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశలకు జీవం పోసినట్టవుతుందని భావిస్తున్నారు.