Manchu Lakshmi: కుమార్తె 'అయిగిరి నందిని...' పాడితే ఆనందబాష్పాలు రాల్చిన మంచు లక్ష్మి... వీడియో ఇదిగో!

Manchu Lakshmi Daughter Vidya Song

  • కుమార్తె పాటను పంచుకున్న మంచు లక్ష్మి
  • వేరియేషన్స్ చూపిస్తూ పాట పాడిన విద్యా నిర్వాణ
  • బాగా పాడిందని కితాబిస్తున్న నెటిజన్లు

నటిగాను, యాంకర్ గానూ తనదైన శైలిలో రాణిస్తున్న మంచు లక్ష్మి కుమార్తె, విద్యా నిర్వాణ తానేమీ తల్లికి తక్కువేమీ కాదని నిరూపించుకుంది. చిన్న వయసులో ఈ మధ్య యూట్యూబ్ లో అడుగుపెట్టి 'చిట్టి చిలకమ్మా...' అంటూ పలకరించిన విద్య, మహా శివరాత్రి సందర్భంగా 'అయిగిరి నందిని...' అంటూ పాడిన స్తోత్రాన్ని మంచు లక్ష్మి ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది.

ఇక ఈ వీడియో వైరల్ కాగా, చూసిన వారంతా విద్యా నిర్వాణ తొలిసారిగా పాడుతున్నట్టు లేదని, అద్భుత ప్రతిభ ఆమె సొంతమని కితాబిస్తున్నారు. పాటలో వేరియేషన్స్ చూపిస్తూ, హావభావాలను ఆమె పలికించిన తీరు ఎంతగానో నచ్చిందని అంటున్నారు. కొన్ని పదాలు పలకడానికి కొంచెం కష్టపడ్డట్టు విద్య కనిపించినా, అదేమీ లోపం కాదని అంటున్నారు. ఇక ఈ పాట రికార్డింగ్ తరువాత మంచు లక్ష్మి తన కుమార్తెను కౌగిలించుకుని, ముద్దాడుతూ ఆనందబాష్పాలు రాల్చింది.

ఈ శివరాత్రి తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని ఈ సందర్భంగా మంచు లక్ష్మి వ్యాఖ్యానించింది. వైరల్ అవుతున్న విద్యా నిర్వాణ పాడిన పాట వీడియోను మీరూ చూడవచ్చు. 

Manchu Lakshmi
Vidya Nirvana
Aiyigiri Nandini
Song
Viral Videos
  • Error fetching data: Network response was not ok

More Telugu News