Shilpa Shetty: మా ఇంటికి మహాలక్ష్మి... తనకు ఆడబిడ్డ పుట్టిందన్న శిల్పా శెట్టి!

Shilpa Shetty Gives Birth to Baby Girl

  • 15న పుట్టిన పాప
  • సమిశా అని పేరు పెట్టాము
  • ఆశీస్సులు కోరిన శిల్పా శెట్టి

రెండోసారి తల్లి అయిన, పొడుగు కాళ్ల సుందరి శిల్పా శెట్టి, పండంటి ఆడబిడ్డను కన్నది. ఈ విషయాన్ని అభిమానులతో స్వయంగా పంచుకున్న ఆమె, తన ప్రార్థనలు ఫలించాయని, తన ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని, పాపకు 'సమిశా' అని పేరు పెట్టామని చెప్పింది. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు గతంలో వియాన్ అన్న కుమారుడు ఉన్నాడన్న సంగతి తెలిసిందే.

"ఇన్నాళ్ల మా ప్రార్థనలు ఫలించి, ప్రతిగా ఓ అద్భుతం జరిగింది. మా హృదయాలు సంతోషంతో నిండిపోయేలా జూనియర్‌ ఎస్‌ఎస్‌కే వచ్చేసింది. ఈ చిట్టి తల్లి మా జీవితాల్లోకి రావడం ఎంతో థ్రిల్లింగ్‌ గా అనిపిస్తోంది. పేరు సమీశా శెట్టి కుంద్రా. ఫిబ్రవరి 15న పాప పుట్టింది. 'స' అంటే సంస్కృతంలో కలిగి ఉండటం. 'మిశ' అంటే రష్యన్‌ భాషలో దేవత. మా కుటుంబాన్ని పరిపూర్ణం చేసిన మహాలక్ష్మి సమిశ. మా దేవతకు మీ ఆశీర్వాదాలు కావాలి. తల్లిదండ్రులు రాజ్- శిల్పాశెట్టి కుంద్రా. అన్నయ్య వియాన్‌‌" అని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో శిల్పా శెట్టి పోస్ట్ పెట్టింది. 

Shilpa Shetty
Samisa
Birth
Baby Girl
  • Loading...

More Telugu News