India: ఇండియాను ఆదుకున్న వరుణుడు... నేటికి మ్యాచ్ రద్దు!

Rain Stops First Day Play of New Zeland India test

  • టీ విరామ సమయంలో భారీ వర్షం
  • మ్యాచ్ ని రద్దు చేసిన అంపైర్లు
  • రేపు వాతావరణం అనుకూలిస్తే మరింత సమయం ఆట

100 పరుగులకే ఐదు కీలకమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను వరుణుడు ఆదుకున్నాడు. వెల్లింగ్టన్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు టీ విరామ సమయంలో భారీ వర్షం పడటం, వర్షం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో, ఈ రోజుకు మ్యాచ్ ని రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.

దీంతో 55 ఓవర్ల వద్ద 122 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన స్థితిలో మ్యాచ్ నిలిచింది. రేపు వాతావరణం అనుకూలిస్తే, మ్యాచ్ ని మరింత సమయం పాటు కొనసాగిస్తామని ఈ సందర్భంగా అంపైర్లు తెలిపారు. ప్రస్తుతం అజింక్యా రహానే 38 పరుగులతో, రిషబ్ పంత్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.

India
New Zeland
Test Cricket
Rain
  • Loading...

More Telugu News