Manimeghalai: తమిళ టీవీ యాంకర్ మణిమేఘలై ఇంట్లో పేలిన కుక్కర్!

Cooker Blast in Anchor Manimeghali House

  • తమిళ బుల్లితెరపై రాణిస్తున్న మణిమేఘలై 
  • విజిల్ రాకుండా పేలిన కుక్కర్
  • వంట గది ధ్వంసమైందన్న యాంకర్

'సూపర్ హిట్స్' అనే తమిళ టీవీ కార్యక్రమం ద్వారా పేరు తెచ్చుకున్న యాంకర్ మణిమేఘలై ఇంట్లో రైస్ కుక్కర్ పేలింది. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో కుక్కర్ దగ్గర ఎవరూ లేరని, అందువల్ల ప్రాణాపాయం జరగలేదని చెబుతూ, ప్రమాదానికి సంబంధించిన ఫొటోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. కుక్కర్ లో విజిల్ రాలేదని, కాసేపటికి అది పేలిపోయి, తన వంట గది మొత్తం నాశనమైందని వెల్లడించింది. కాగా, 2017లో మాస్టర్ హుసైన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న మణిమేఘలై, ఆపై ఏడాది తరువాత భర్తను విడిచి ఒంటరిగా ఉంటోంది.

Manimeghalai
Tamil
Anchor
Cooker
  • Loading...

More Telugu News