Chiranjeevi: చిన్నల్లుడి సినిమాపై దృష్టిపెట్టిన చిరంజీవి

Super Machi MOvie

  • షూటింగు దశలో 'సూపర్ మచ్చి'
  • అవుట్ పుట్ పట్ల చిరూ అసంతృప్తి 
  • రంగంలోకి పరుచూరి బ్రదర్స్

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కథానాయకుడిగా 'సూపర్ మచ్చి' చిత్రం రూపొందుతోంది. రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి పులివాసు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. రీసెంట్ గా ఈ సినిమా అవుట్ పుట్ ను చిరంజీవి పరిశీలించారట. ఇప్పటివరకూ వచ్చిన అవుట్ పుట్ పట్ల ఆయన కొంత అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.

చిరంజీవి పూర్తి కథను విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాతనే ఈ ప్రాజెక్టు మొదలైందట. అయితే స్క్రీన్ ప్లే విషయంలో పెద్దగా పట్టు కనిపించకపోవడంతో, ఆయన పరుచూరి బ్రదర్స్ ను రంగంలోకి దింపినట్టుగా సమాచారం. అలాగే డైలాగ్స్ పై కూడా దృష్టి పెట్టమని పరుచూరి బ్రదర్స్ కి చెప్పారని అంటున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, సూచనలు .. సలహాలు ఇస్తూ వెళుతున్నారట. నిర్మాణ పరమైన విలువల దగ్గర రాజీ పడొద్దని కూడా ఆయన రిజ్వాన్ కి చెప్పారని అంటున్నారు. సినిమా పూర్తయిన తరువాత దీనిని దిల్ రాజు చేతిలో పెట్టాలనే ఉద్దేశంతో చిరంజీవి వున్నారని చెబుతున్నారు. కల్యాణ్ దేవ్ హిట్ కోసం చిరంజీవి కాస్త గట్టిగానే కూర్చున్నారనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

Chiranjeevi
Kalyan Dev
Super Machi Movie
  • Loading...

More Telugu News