Love: యువతిపై యాసిడ్ పోస్తానంటూ ఇంట్లో దూరిన యువకుడు... చావగొట్టి పోలీసులకు అప్పగించిన స్థానికులు!

Youth molested minor girl arrested

  • నిజామాబాద్ జిల్లాలో ఘటన
  • ప్రేమించాలని వివాహితుడి వేధింపులు
  • ఫోక్సో చట్టం కింద కేసు నమోదు

తనను ప్రేమించకుంటే యాసిడ్ పోస్తానని బెదిరిస్తూ, ఇంట్లోకి దూరిన ఓ యువకుడిని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా, నాగిరెడ్డి పేట పరిధిలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, మండల పరిధిలో ఉంటున్న ఓ మైనర్ బాలికను జలాల్ పూర్ గ్రామానికి చెందిన ఎర్ర రవి అనే యువకుడు, తనను ప్రేమించాలని గత కొంత కాలంగా వేధిస్తున్నాడు.

ఈ క్రమంలో నిన్న తెల్లవారుజామున బాలిక ఇంట్లోకి గోడ దూకి ప్రవేశించిన అతను, తనను లవ్ చేయకుంటే, యాసిడ్ పోస్తానని బెదిరించాడు. దీంతో భయపడిన బాలిక, గట్టిగా కేకలు వేయడంతో, చుట్టు పక్కల వారు అప్రమత్తమయ్యారు. రవిని పట్టుకుని చావగొట్టి, పోలీసులకు సమాచారాన్ని అందించారు.

పోలీసులు రవిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. నిందితుడు గతంలో ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, అతనికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

Love
Nizamabad District
Police
Acid
Arrest
  • Loading...

More Telugu News