కండలను పెంచి.. షాక్ ఇస్తున్న దక్షిణాది హీరో!
- తన 30వ చిత్రం కోసం శ్రమించిన ఆర్య
- నీ హార్డ్ వర్క్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి
- అభినందిస్తున్న ఇండియన్ స్టార్స్
తన కొత్త సినిమాకు సంబంధించిన వివరాలను చెబుతానని ఇటీవల ప్రకటించిన ఆర్య, ఓ ట్వీట్ లో ఈ ఫొటోను పోస్ట్ చేశాడు. "మీరంతట మీరు బలవంతులుగా మారేంత వరకు తెలియదు మీరెంత బలవంతులో" అని దీనికో క్యాప్షన్ కూడా పెట్టాడు. ఈ ఫొటోను చూసిన వారంతా, ఆర్య హార్డ్ వర్క్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని కితాబిస్తున్నారు. పలువురు ఇండియన్ స్టార్స్ నుంచి ఆర్యకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అన్నట్టు ఆర్య, అల్లు అర్జున్ హీరోగా నటించిన 'వరుడు' చిత్రంలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.