New Zeland: భారత్ బ్యాటింగ్ పేలవం... 116 పరుగులకే 5 వికెట్లు!

India top Order Batsmen Fail in First Test

  • వెల్లింగ్టన్ లో తొలి టెస్ట్
  • న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి తేలిపోయిన టాప్ ఆర్డర్
  • 2 పరుగులకే కోహ్లీ అవుట్

వెల్లింగ్టన్ లో ప్రారంభమైన తొలి టెస్టులో భారత బ్యాటింగ్ పేలవంగా సాగుతోంది. 50 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు 116 పరుగులు మాత్రమే చేసి, కీలకమైన టాప్ ఆర్డర్ ను కోల్పోయింది. న్యూజిలాండ్ బౌలర్ల ధాటికి ఓపెనర్లు పృధ్వీ షా 16 పరుగులకు, మయాంక్ అగర్వాల్ 34 పరుగులకు అవుట్ కాగా, పుజారా 11 పరుగులకు, కోహ్లీ 2 పరుగులకు, హనుమ విహారి 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యారు. ప్రస్తుతం రహానే 37, రిషబ్ పంత్ 6 పరుగులతో ఉన్నారు. జెమీసన్ కు 3, బౌల్ట్, సౌధీలకు చెరో వికెట్ లభించాయి.

New Zeland
India
Test Cricket
  • Loading...

More Telugu News