Rakul Preet Singh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Rakul Preeth Singh about body shap for films

  • నా వల్ల కాదంటున్న రకుల్ 
  • ఇటలీలో సందడి చేసిన రామ్ 
  • దుబాయ్ కి చైతు, సాయిపల్లవి

 *  ఆరోగ్యాన్ని దెబ్బ తీసే పాత్రలు పోషించమంటే మాత్రం తన వల్ల కాదంటోంది కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్. 'ఏదైనా పాత్ర కోసం అమాంతం పెద్ద మొత్తంలో బరువు పెంచమన్నా, లేక తగ్గమన్నా నా వల్ల కాదు. అలా చేయడం అన్నది ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. అందుకే అలాంటి పాత్రలకు నో చెబుతాను' అని చెప్పింది.
*  కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న 'రెడ్' చిత్రం షూటింగ్ తాజాగా ఇటలీలో జరిగింది. అక్కడి పలు లోకేషన్లలో రెండు పాటలను చిత్రీకరించారు. నివేద పేతురాజ్, మాళవిక శర్మ, అమ్రిత అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న తాజా చిత్రం 'లవ్' షూటింగును దుబాయ్ లో నిర్వహించనున్నారు. ఇందుకోసం హీరో హీరోయిన్లు నాగ చైతన్య, సాయిపల్లవి త్వరలో దుబాయ్ వెళుతున్నారు. అక్కడ కొన్ని పాటలు, సీన్లు చిత్రీకరిస్తారు.  

Rakul Preet Singh
Ram
Niveda
Sai Pallavi
  • Loading...

More Telugu News