Asaduddin Owaisi: సీఏఏ వ్యతిరేక కార్యక్రమంలో కలకలం రేపిన యువతి.. ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు

Woman chants Pakistan Zindabad at Asaduddin Owaisis rally in Bengaluru

  • బెంగళూరులో ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్’ కార్యక్రమం
  • అసదుద్దీన్ ప్రసంగం తర్వాత వేదిక ఎక్కిన యువతి
  • ఆమెకు, తమకు సంబంధం లేదన్న అసద్

పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా బెంగళూరులో నిర్వహించిన ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్’ కార్యక్రమంలో ఓ యువతి పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసి కలకలం రేపింది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగించిన తర్వాత వేదిక ఎక్కి మైక్ వద్దకు వచ్చిన అమూల్య అనే యువతి ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసింది.

వెంటనే అప్రమత్తమైన ఒవైసీ.. ఆమె వద్దకు వచ్చి మైక్ లాక్కుకుని పక్కకు తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమూల్య వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. ఆమెకు ఈ కార్యక్రమానికి సంబంధం లేదని, కార్యక్రమ నిర్వాహకులు ఆమెను ఆహ్వానించలేదని వివరణ ఇచ్చారు. తాము ఎప్పటికీ పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వబోమని, భారత్‌తోనే ఉంటామని ఒవైసీ స్పష్టం చేశారు.

Asaduddin Owaisi
Bengaluru
CAA
Pakistan
  • Error fetching data: Network response was not ok

More Telugu News