Wellington: తొలి టెస్టు: తీరుమారని భారత్.. 40 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా

Team India loss 3 wickets for 40 in wellington test

  • టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్
  • పీకలోతు కష్టాల్లో భారత్
  • తీవ్రంగా నిరాశపరిచిన కోహ్లీ

వన్డేల్లో ఎదురైన ఘోర పరాభవం నుంచి భారత జట్టు పాఠాలు నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్‌లోని బేసిన్‌ రిజర్వు మైదానంలో ప్రారంభమైన తొలి టెస్టులో క్రమంగా కష్టాలవైపు జారుకుంటోంది.

టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీసేన 40 పరుగులకే మూడు కీలక వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్ పృథ్వీషా (16), ఛటేశ్వర్ పుజారా (11), కెప్టెన్ విరాట్ కోహ్లీ (2) తీవ్రంగా నిరాశపరిచారు. క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్, అజింక్య రహానే క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం 30 ఓవర్లు పూర్తయ్యాయి. భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది.

Wellington
New zealand
India
Test match
  • Loading...

More Telugu News