Narendra Modi: ప్రధాని మోదీని కలిసిన రామాలయం ట్రస్ట్​ సభ్యులు

Members of the Ramayalam Trust met PM Modi

  • రామ జన్మభూమి స్థలం విషయంపై చర్చలు!
  • అయోధ్యకు రావాలని ప్రధానికి ఆహ్వానం
  • ట్రస్టు తొలి సమావేశమైన మరునాడే భేటీ

అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు’ సభ్యులు ప్రధాని మోదీని కలిశారు. గురువారం ప్రధాని నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. అయోధ్యలోని స్థలం, రామాలయ నిర్మాణానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.

అయోధ్యకు రావాలని ఆహ్వానం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అయోధ్యను సందర్శించేందుకు రావాలంటూ ట్రస్టు సభ్యులు కోరారు. తర్వాత ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ మీడియాతో మాట్లాడారు. ట్రస్టు ఏర్పాటు, తొలి సమావేశం నేపథ్యంలో ప్రధాని మోదీని మర్యాద పూర్వకంగా కలిశామని తెలిపారు.

Narendra Modi
Ayodhya Ram Mandir
Ayodhya Temple Trust
  • Loading...

More Telugu News