Lakshman: కల్వకుంట్ల ఫ్యామిలీకి పదవులు వస్తున్నాయి కానీ యువతకు ఉద్యోగాలు మాత్రం రావడంలేదు: లక్ష్మణ్

TS BJP Chief Lakshman slams Kalvakuntla family

  • నిరుద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న లక్ష్మణ్
  • ఆరేళ్లలో ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆరోపణ
  • నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడంలేదని ఆగ్రహం

టీఆర్ఎస్ సర్కారుపై బీజేపీ తెలంగాణ చీఫ్ లక్ష్మణ్ ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఆరేళ్లలో ఒక్క గ్రూప్-1 నియామక ప్రకటన కూడా చేయలేదని, కనీసం నిరుద్యోగ యువతకు ఇస్తామన్న భృతిని కూడా ఇవ్వకుండా పక్కనబెట్టేశారని ఆరోపించారు.

కల్వకుంట్ల కుటుంబీకులకు పదవులు లభిస్తున్నాయే తప్ప, రాష్ట్రంలోని యువతకు మాత్రం ఉద్యోగాలు లభించడంలేదని అన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ప్రభుత్వానికి వంతపాడుతూ ఉద్యోగులను వంచిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలప్పుడే సీఎం కేసీఆర్ కు ఉద్యోగులు గుర్తొస్తారని, ఎన్నికలైపోయాక ఉద్యోగులను కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. ప్రతినెల జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

Lakshman
TRS
KCR
Telangana
BJP
Kalvakuntla Family
Unemployment
  • Loading...

More Telugu News