Raghu Kunche: విజయ్ సేతుపతిని రజనీకాంత్ మెచ్చుకోవడం విశేషం: సంగీత దర్శకుడు రఘు కుంచె

Vijay Sethupathi

  • విజయ్ సేతుపతి అంటే ఇష్టం 
  • తమిళనాట ఆయనకి ఎంతో క్రేజ్ వుంది
  • ఆయన సింప్లిసిటీ చూస్తే ఆశ్చర్యమేస్తుందన్న రఘు

గాయకుడిగా .. సంగీత దర్శకుడిగా రఘు కుంచెకు మంచి గుర్తింపు వుంది. ఆయన పాడిన కొన్ని మాస్ పాటలు .. స్వర పరిచిన మాస్ బాణీలు ఆయనకి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అలాంటి రఘు కుంచె తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. " ఇప్పుడున్న జనరేషన్లో నాకు బాగా నచ్చిన నటుడు విజయ్ సేతుపతి. నటన పరంగాను .. వ్యక్తిత్వం పరంగాను ఆయన అంటే అభిమానం.

విజయ్ సేతుపతి గురించి తమిళనాట గొప్పగా చెప్పుకుంటారు. ఎంతో ఎత్తుకు ఎదిగినప్పటికీ ఆయన చాలా సింపుల్ గా వుంటాడు. తన స్టార్ డమ్ ను ఎంతమాత్రం పట్టించుకోకుండా జనంలో తిరిగేస్తూ వుంటాడు. పెద్ద పెద్ద ఫంక్షన్స్ కి కూడా ఆయన సాధారణమైన వస్త్రాలు .. పాదరక్షలు ధరించి వస్తాడు. ఒక వేదికపై రజనీకాంత్ గారు మాట్లాడుతూ, 'విజయ్ సేతుపతి నటుడు కాదు .. మహానటుడు' అన్నారు. విజయ్ సేతుపతిని గురించి చెప్పుకోవడానికి ఆ ఒక్కమాట చాలు" అని అన్నాడు.

Raghu Kunche
Vijay Sethupathi
Rajani Kanth
  • Loading...

More Telugu News