Corona Virus: షిప్ లో వున్న మరో ఇండియన్​ కు కరోనా వైరస్​!

One More Indian Tests Positive For Coronavirus On Japan Cruise Ship

  • జపాన్ షిప్ లో కొత్తగా 79 మందికి వైరస్
  • ఇప్పటివరకు 8 మంది భారతీయులకు వ్యాప్తి
  • షిప్ లోని వైరస్ బాధితుల్లో ఇద్దరి మృతి

జపాన్ సముద్ర జలాల్లో ఉన్న డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ లో ఉన్న భారతీయులలో మరొకరికి కరోనా వైరస్ సోకింది. దీంతో కరోనా బారిన పడిన భారతీయుల సంఖ్య ఎనిమిది మందికి పెరిగినట్టు జపాన్ అధికారులు ప్రకటించారు. మొత్తంగా షిప్ లో కొత్తగా 79 మందికి కరోనా వైరస్ సోకినట్టు చెప్పారు. కరోనా సోకిన భారతీయులను సముద్ర తీరంలో ఉన్న క్వారంటైన్ హాస్పిటల్ కు తరలించి చికిత్స చేస్తున్నామని, వారు కోలుకుంటున్నారని తెలిపారు.

షిప్ లో ఇద్దరు మృతి

షిప్ లో మొత్తం ప్రయాణికులు, సిబ్బంది కలిపి 3,711 మంది ఉండగా.. అందులో భారతీయులు 138 మంది ఉన్నారు. అయితే ఈ షిప్ లో ప్రయాణించి వైరస్ బారినపడినవారిలో గురువారం ఇద్దరు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. అయితే ఆ ఇద్దరూ 70 ఏళ్ల వయసు పైబడినవారని, వారిని పది రోజుల కిందటే తీరంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించడం మొదలుపెట్టామని చెప్పారు. పెద్ద వయసు వారు కావడంతో వైరస్ సోకడం వల్ల తలెత్తిన లక్షణాలను తట్టుకోలేకపోయారని పేర్కొన్నారు.

Corona Virus
Corona
indians
Japan
Japan ship
  • Loading...

More Telugu News