Amaravati: మందడంపై డ్రోన్ కెమెరాలతో నిఘా.. రైతుల ఆగ్రహం
- రెండు నెలలు దాటిన అమరావతి ఆందోళనలు
- డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన పోలీసులు
- అభ్యంతరం వ్యక్తం చేసిన రైతులు
రాజధానిని తరలించవద్దని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు రెండు నెలలు దాటిపోయాయి. తమ ప్రాణాలు పోయినా రాజధానిని తరలించేందుకు తాము ఒప్పుకోబోమంటూ ఆందోళనను వారు తీవ్రతరం చేస్తున్నారు. మరోవైపు, మందడం గ్రామంలో ఈరోజు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు ఆందోళన చేస్తున్న ప్రాంతాన్ని డ్రోన్ కెమెరాలతో పోలీసులు చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో, పోలీసుల తీరుపై నిరసనకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ఆర్థిక నేరగాళ్లం కాదని, అరాచకవాదులం కాదని, తమను డ్రోన్లతో ఎందుకు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. దీంతో, గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.