Vinay Sharma: నిర్భయ దోషి వినయ్ శర్మ తలకు గాయమైంది.. కన్న తల్లిని కూడా గుర్తు పట్టడం లేదు: లాయర్

Nirbhaya convict unable to recognise people says his lawyer

  • జైలు గోడకు తలను బాదుకున్న వినయ్ శర్మ
  • ఆదివారం చోటుచేసుకున్న ఘటన
  • వినయ్ ఎవరినీ గుర్తు పట్టడం లేదన్న లాయర్

నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ జైలు గదిలోని గోడకు తలను బాదుకుని గాయపడిన సంగతి తెలిసిందే. మార్చ్ 3వ తేదీని దోషులకు ఉరితీతను అమలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శిక్షను వాయిదా వేయించడానికి దోషులు వరుసగా పలు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వినయ్ శర్మ తనను తాను గాయపరుచుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. అనంతరం అతనికి చికిత్స అందించారు.

ఈ నేపథ్యంలో అతని తరపు లాయర్ మాట్లాడుతూ, వినయ్ శర్మ ఎవరినీ గుర్తు పట్టలేకపోతున్నాడని... కన్న తల్లిని కూడా గుర్తించలేదని చెప్పారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అల్లైడ్ సైన్సెస్ ఆసుపత్రికి వినయ్ ను రెఫర్ చేయాలని కోరారు.

Vinay Sharma
Nirbhaya
Nirbhaya Convict
Injured
  • Loading...

More Telugu News