Vijayasai Reddy: అరెస్టుల భయం పట్టుకున్నప్పుడల్లా ఇలా బస్సు యాత్రలు చేస్తుంటాడు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy alleges Chandrababu over Praja Chaitanya Yatra

  • ప్రజాచైతన్య యాత్ర చేపడుతున్న చంద్రబాబు
  • కార్యకర్తల మధ్యన వుంటే తాకలేరన్న ధీమా అంటూ విమర్శ  
  • మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడంటూ విజయసాయి వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తుతం ప్రజాచైతన్య యాత్ర పేరిట బస్సులో పర్యటిస్తున్నారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. అరెస్టు భయం పట్టుకున్నప్పుడల్లా దీక్షలు, బస్సు యాత్రలు ఏర్పాటు చేసుకుంటాడని ఆరోపించారు. "కార్యకర్తల మధ్యన ఉంటే తననెవరూ తాకలేరనే ధీమా అనుకుంటా. ఎమ్మెల్యేలను చుట్టు పెట్టుకుని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడు. చేసిన తప్పులేమైనా సామాన్యమైనవా తప్పించుకోవడానికి!" అంటూ ట్విట్టర్ లో స్పందించారు.

Vijayasai Reddy
Chandrababu
Praja Chaitanya Yatra
Telugudesam
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News