Mahesh Babu: ఆ రోజు ఫోన్లో ఆవిడ కూడా మాట్లాడుతుందని అనుకున్నాను!: 'విజయనిర్మల విగ్రహావిష్కరణ' సభలో భావోద్వేగానికి గురైన మహేశ్ బాబు

- నా సినిమాలు రిలీజ్ అయిన సమయంలో ఫోన్ చేసి మాట్లాడేది
- సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలయ్యాక నాన్న గారు ఫోన్ చేశారు
- ఆ తర్వాత ఆవిడ మాట్లాడుతుందని నేను అనుకున్నాను.
- అయితే, ఆమె చనిపోయిందని గుర్తుకొచ్చింది
ప్రముఖ నటి, దర్శకురాలు దివంగత విజయనిర్మల 74 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ శివారులోని నానక్ రామ్ గూడాలోని కృష్ణ, విజయ నిర్మల నివాసంలో.. విజయనిర్మల విగ్రహాన్ని ఆవిష్కరించారు. విజయనిర్మల స్త్రీ శక్తి అవార్డును దర్శకురాలు నందినిరెడ్డికి కృష్ణంరాజు, మహేశ్ బాబు చేతుల మీదుగా ప్రధానం చేశారు. అనంతరం మహేశ్ బాబు మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
