Viral Videos: దొంగతో హీరోలా ఫైటింగ్‌ చేసి షాక్‌ ఇచ్చిన తాతయ్య.. వీడియో వైరల్

old man bravely fights off robber video goes viral

  • సౌత్ వేల్స్‌లో ఘటన
  • డబ్బు ఇవ్వాలన్న దొంగ
  • ఎదురు తిరిగిన వృద్ధుడు
  • పారిపోయిన దొంగ

దోచుకోవడానికి వచ్చిన దొంగతో హీరోలా ఓ తాతయ్య ఫైటింగ్‌ చేసి అందరినీ ఆశ్చర్యపర్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది. ధైర్యసాహసాలు ప్రదర్శించడానికి వయసు అడ్డుకాదని తాతయ్య నిరూపించాడు.

సౌత్ వేల్స్‌లోని సైన్‌బ్బూరీస్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కారు పార్క్ చేసి దిగిన 77 ఏళ్ల వృద్ధుడి వద్దకు వచ్చిన దొంగ ఆయనను బెదిరించాలని చూశాడు. వృద్ధుడు ఏటీఎంలో డ్రా చేసుకున్న డబ్బులను లాక్కోవడానికి ప్రయత్నించడంతో పాటు ఏటీఎం కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో తాతయ్య ఎదురు తిరిగి బాక్సింగ్‌ పంచులు కురిపించాడు. దీంతో దొంగ పారిపోవాల్సి వచ్చింది. ఆ వృద్ధుడి బాక్సింగ్‌ పట్ల నెటిజన్లు ప్రశంసల జల్లుకురిపిస్తున్నారు.

Viral Videos
youtube
  • Loading...

More Telugu News