Prakasam District: వెలిగొండ టన్నెల్ లోపలికి వెళ్లి పనులు పరిశీలించిన సీఎం జగన్

CM jagan at veligonda tunnel

  • ఉదయం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సీఎం 
  • ఆయనకు ఘన స్వాగతం పలికిన మంత్రులు 
  • అనంతరం పనులపై పర్యవేక్షణ

ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో నిర్మాణంలో ఉన్న పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను ఈరోజు ఉదయం పరిశీలించారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఇక్కడకు చేరుకున్న ముఖ్యమంత్రికి తొలుత మంత్రులు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అనంతరం టన్నెల్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి ప్రత్యేక వాహనంలో టన్నెల్ లోపలకి వెళ్లారు. జరుగుతున్న పనులను పరిశీలించారు. జగన్ వెంట మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, అనిల్ కుమార్ యాదవ్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు.

Prakasam District
veligonda tunnel
CM jagan
  • Loading...

More Telugu News