Donald Trump: జనాభా 55 లక్షలైతే స్వాగతానికి 70 లక్షలు ఎలా వస్తారు?.. ట్రంప్ స్వాగత సత్కారాలపై సెటైర్లు!

Is it possible with 70 lakh people for trumph grand wellcome asks netzens

  • ట్రంప్ పర్యటన సందర్భంగా హడావుడిపై నెటిజన్ల మండిపాటు 
  • అయినా ఆయనేమైనా దేవుడా? 
  • అతని కోసం అంత హడావుడి అవసరమా?

ప్రపంచ పెద్దన్న, అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన సందర్భంగా 70 లక్షల మందితో ఆయనకు స్వాగతం పలకనున్నట్లు వస్తున్న వార్తలపై నెటిజన్లు మండిపడుతున్నారు. అహ్మాదాబాద్ జనాభానే 50 నుంచి 55 లక్షల మధ్య ఉంటే 70 లక్షల మంది ఎలాగొస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సభలా స్వాగతానికి కూడా జన సమీకరణ చేస్తారా?' అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈనెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి 'నమస్తే ప్రెసిడెంట్ ట్రంప్' కార్యక్రమం జరిగే మోతేరా స్టేడియం వరకు రోడ్డు షో ఏర్పాటు చేశారు. ఈ రోడ్డులో దాదాపు 70 లక్షల మంది జనం తనకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటారని వాషింగ్టన్ లో ట్రంప్ స్వయంగా ప్రకటించడంతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

అంతమందితో స్వాగతం పలకడానికి ఆయనేమైనా దేవుడా? అని ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు. ఒక దేశ అధ్యక్షుడి పర్యటనపై అంత హడావుడి దేనికని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

  • Loading...

More Telugu News