Love Marriage: ప్రేమించి మోసం చేద్దామనుకున్నాడు... పోలీసులు పెళ్లి చేసి పంపారు!

Love Marriage In Chennai Police Station

  • చెన్నైలో ఘటన
  • నాలుగేళ్ల ప్రేమ తరువాత అందంగా లేదన్న వెంకటేశ్
  • విదేశాలకు పారిపోతుంటే అరెస్ట్ చేసిన పోలీసులు

నాలుగేళ్ల పాటు ప్రేమించాడు. పెళ్లాడతానని నమ్మించాడు. చివరకు అందంగా లేవంటూ పెళ్లికి నిరాకరించి, వదిలించుకునే క్రమంలో విదేశాలకు పారిపోబోయాడు. బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు, అతన్ని పట్టుకొచ్చి, నాలుగు వాయించి, పోలీసు స్టేషన్ లోనే ప్రియురాలి మెడలో తాళి కట్టించి, పెళ్లి పెద్దలుగా నిలిచారు.

ఈ ఘటన చెన్నై పరిధిలోని అనకాపుత్తూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఇక్కడి లేబర్ వీధికి చెందిన కవిత (23), మెలిచలూరుకు చెందిన వెంకటేశ్ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి కవిత పట్టుబట్టడంతో ఆమె నుంచి తప్పించుకు తిరగడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలో పోలీసులు విచారిస్తుండగా, అతను విదేశాలకు పారిపోయే ఉద్దేశంలో ఉన్నాడని తెలుసుకుని, వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కవిత అందంగా లేని కారణంగా వివాహం వద్దనుకుంటున్నట్టు చెప్పాడు. దీంతో అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆపై వెంకటేశ్ వివాహానికి సమ్మతించడంతో స్టేషన్ లోనే తాళి కట్టించారు. తాము ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకుంటున్నట్టు ఇద్దరితో స్టేట్ మెంట్ రాయించి, వారి వివాహాన్ని రిజిస్టర్ చేయించారు.

Love Marriage
Tamilnadu
Chennai
Police
  • Loading...

More Telugu News