Tamilnadu: ఇంటికి నిప్పంటుకున్నా.... టీవీ సీరియల్ లో నిమగ్నమై, గృహిణి సజీవదహనం!

Lady Burnt Alive in Tamilnadu

  • తమిళనాడులోని తిరువొత్తియూరు సమీపంలో ఘటన
  • దీపం వెలిగించి, టీవీ సీరియల్ కోసం వెళ్లిన మహిళ
  • మంటలను ఆర్పే క్రమంలో ఒంటికి మంటలు అంటుకుని మృతి

ఓపక్క తన ఇంటికి నిప్పంటుకుని తగలబడి పోతూ ఉంటే, అదేమీ తెలియకుండా టీవీ సీరియల్ ను తదేకంగా చూస్తూ, దానిలోనే నిమగ్నమైపోయిన ఓ మహిళ, ఆపై మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి సజీవ దహనమైంది. ఈ ఘటన తమిళనాడులోని తిరువొత్తియూరు సమీపంలో జరిగింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇక్కడి కామరాజపురం, భగత్ సింగ్ స్ట్రీట్ కు చెందిన రమేశ్, మహాలక్ష్మి (41) దంపతులు కాగా, మహాలక్ష్మి భర్తతో విడిపోయి, తన బంధువుల ఇంట్లో అద్దెకు ఉంటోంది. సాయంత్రం ఇంటిలో దీపం వెలిగించిన ఆమె, టీవీ సీరియల్ చూసేందుకు కిందకు దిగింది. దీపం ఒరిగి ఇంటికి మంటలు అంటుకోగా, వాటిని ఆర్పే ప్రయత్నంలో ఆమెకు మంటలు అంటుకుని సజీవ దహనమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.

Tamilnadu
Fire Accident
Ladi
Burnt Alive
Tv Serial
  • Loading...

More Telugu News