Hyderabad: వారెంటు ఇచ్చేందుకు వచ్చిన కానిస్టేబుల్.. కాలుకొరికేసిన నిందితుడు!

constable injured in accused ride

  • నిందితుని పై గతంలో చీటింగ్ కేసు నమోదు 
  • ఇందుకు సంబంధించి కోర్టు ఆర్డర్ ఇచ్చేందుకు వెళ్లిన పోలీస్ 
  • దాడిచేసి గాయపరచడంతో అరెస్టు చేసి స్టేషన్ కి తరలింపు

మోసం చేశాడన్న కేసు ఎదుర్కొంటున్న వ్యక్తికి కోర్టు జారీ చేసిన వారెంటు అందించేందుకు వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ పై నిందితుడు దాడి చేయడమేకాక అతని కాలుకొరికి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఇది. పోలీసుల కథనం మేరకు... హైదరాబాద్, యూసుఫ్ గూడ కృష్ణకాంత్ పార్క్ సమీపంలో నివసించే దాట్ల శ్రీనివాస్ గోపీచంద్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 2019లో చీటింగ్ కేసు నమోదైంది.

ఈ కేసుకు సంబంధించి వారెంటు ఉండడంతో దాన్ని ఇచ్చేందుకు కానిస్టేబుల్ విష్ణు అతని ఇంటికి నిన్న వెళ్లాడు. ముందే గమనించాడో, కనపడగానే కంగారుపడ్డాడో తెలియదుగాని తలుపు తీసిన శ్రీనివాస్ వెంటనే సదరు కానిస్టేబుల్ పై దాడి చేశాడు. అతని కాలును కొరికేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో అప్రమత్తమైన కానిస్టేబుల్ తన సిబ్బంది సాయంతో అతన్ని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు.

Hyderabad
yosufguda
cheating case accused
ride on constable
Crime News
  • Loading...

More Telugu News