Dipali Goyenka: ఆఫీసులో డ్యాన్స్ చేసి.. జోష్ పెంచిన 'వెల్ స్పన్' సీఈఓ దీపాలీ గోయెంకా... వీడియో వైరలో వైరల్!

Welspun CEO Depali Dance Viral

  • ఆఫీసులోకి వస్తూ దీపాలీ నృత్యం
  • సోషల్ మీడియాలో షేర్ చేసిన హర్ష్ గోయంకా
  • మీ సంగతేంటని ప్రశ్నించిన దీపాలీ

ఆఫీసులో తనతో పాటు పనిచేసే ఉద్యోగులను మరింతగా పనిలో మమేకం చేయాలన్న ఉద్దేశంతో, వారితో కలసిపోయిన ఓ సీఈఓ చేసిన వినూత్న నృత్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. గోయంకా కుటుంబ వారసురాలిగా వ్యాపార సామ్రాజ్యంలో ప్రవేశించిన దీపాలీ గోయంకా, ప్రస్తుతం వెల్ స్పన్ ఇండియా సీఈఓ గా ఉన్నా, తన ఆఫీస్ లోకి ప్రవేశిస్తూ, ఆమె చేసిన నృత్యం ఇప్పుడు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.

ఉద్యోగుల క్యాబిన్ దగ్గర ఆగిన ఆమె, ప్రభుదేవా సాంగ్ 'ముక్కాలా... ముకాబులా...'కు డ్యాన్ చేసి తన సహచరుల్లో జోష్ ను నింపింది. ఆమెను చూసిన మిగతా ఉద్యోగులంతా పాదం కలిపారు. ఈ వీడియోను ఆర్పీజీ ఎంటర్‌ ప్రైజెస్‌ చైర్మన్‌ హర్ష్‌ గోయంకా తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేయగా, అది వైరల్ అయింది.

ఇక ఈ ట్వీట్ పై స్పందించిన దీపాలీ, 'మీ ఆఫీసు కూడా ఇలా సంతోషంగా ఉంటే చూడాలనుంది' అని సమాధానం ఇచ్చారు. అంతేనా, పారిశ్రామిక దిగ్గజాలు ఆనంద్ మహీంద్రా, గౌతమ్ అదానీ వంటి వారికి దీన్ని ట్యాగ్ చేసిన ఆమె, తన ఆఫీసులో ఇంత స్వేచ్ఛ ఉందని, మీ ఆఫీసు సంగతేంటని ప్రశ్నించారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు, తమకు ఇటువంటి బాస్ ఉంటే బాగుండేదని వ్యాఖ్యానిస్తున్నారు.

Dipali Goyenka
Welspun
CEO
Dance
Viral Videos
  • Error fetching data: Network response was not ok

More Telugu News