bheeshma poster: పేరు మారుస్తారా.. సినిమాను అడ్డుకోమంటారా?.. ‘భీష్మ’ టైటిల్‌పై బీజేపీ ధార్మిక సెల్ అభ్యంతరం

Controversy on tollywood movie Bheeshma title

  • భీష్ముడిలాంటి గొప్ప వ్యక్తి పేరు లవర్ బాయ్ పాత్రకు పెడతారా
  • పేరు మార్చకుంటే సినిమాను అడ్డుకుంటాం
  • అవసరమైతే న్యాయస్థానానికి వెళ్తాం

రేపు విడుదల కాబోతున్న టాలీవుడ్ నటుడు నితిన్ సినిమా ‘భీష్మ’ను వివాదం చుట్టుముడుతోంది. ఈ సినిమాకు భీష్ముడి పేరు పెట్టడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని బీజేపీ ధార్మిక సెల్ ఆవేదన వ్యక్తం చేసింది. భీష్ముడిలాంటి గొప్ప వ్యక్తి పేరును సినిమాకు పెట్టడాన్ని సహించబోమని, వెంటనే పేరు మార్చాలని ఆ సెల్ కన్వీనర్ తూములూరి శ్రీకృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. ఆజన్మ బ్రహ్మచారి అయిన భీష్ముడి పేరును లవర్ బాయ్ పాత్రకు పెట్టడం సరికాదన్నారు. వెంటనే సినిమా పేరును మార్చాలని, లేదంటే సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామన్నారు.

bheeshma poster
Tollywood
Actor Nitin
  • Loading...

More Telugu News