Vinay Sharma: బ్రేకింగ్... నిర్భయ దోషి వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం!

Nirbhaya Convict Vinay Sharma Attempts Sucide

  • తలను గోడకేసి బాదుకున్న వినయ్ శర్మ
  • ఉరి తప్పించుకోవాలని చూస్తున్న దోషులు
  • మార్చి 3న ఉరి అనుమానమే

తీహార్ జైలులో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న నిర్భయ దోషి వినయ్ శర్మ, ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో దోషులను మార్చి 3న ఉరి తీయాలని పాటియాలా హైకోర్టు మూడోసారి డెత్ వారెంట్ ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఉరిని తప్పించుకోవాలని పలు మార్గాలను దోషులు అన్వేషిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో దోషి వినయ్‌ శర్మ జైలులో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని అధికారులు వెల్లడించారు. తనను ఉంచిన సెల్‌ లో గోడకు తలను బాదుకున్నాడని, ఈ ఘటనలో వినయ్‌ కి స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపారు. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలులో ఎలాంటి జాప్యం చోటు చేసుకోరాదని నిర్భయ తల్లి ఆశాదేవి అభిలషించిన సంగతి తెలిసిందే.

కాగా, ఇప్పటివరకూ తన ముందున్న న్యాయ అవకాశాలను ఉపయోగించుకోని దోషి పవన్‌ గుప్తా, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ పిటిషన్‌ దాఖలు చేస్తారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. దీంతో 3వ తేదీన వారి ఉరి అనుమానంగానే ఉంది.

Vinay Sharma
Nirbhaya
Sucide Attempt
Tihar
  • Loading...

More Telugu News