Germany: కాల్పులతో దద్దరిల్లిన జర్మనీలోని హనావ్.. 8 మంది మృతి

8 dead in mass shooting in Germany

  • రెండు చోట్ల కాల్పులు జరిపిన సాయుధులు
  • తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురు
  • ఉగ్ర ఘటనగా అనుమానం

జర్మనీలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం నిన్న రాత్రి 10 గంటలు దాటిన తర్వాత హనావ్ నగరంలో గుర్తు తెలియని సాయుధులు కాల్పులకు తెగబడ్డారు. నగరం మధ్యలో ఉన్న హుక్కా సెంటర్ వద్ద తొలుత కాల్పులు జరిపిన దుండగులు ఆ తర్వాత మరో ప్రాంతానికి చేరుకుని కాల్పులు జరిపారు. తొలుత జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, రెండోసారి జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల అనంతరం దుండగులు పరారయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. దీనిని ఉగ్రఘటనగా పోలీసులు అనుమానిస్తున్నారు.

Germany
shooting
Terror attack
  • Loading...

More Telugu News