Tirumala: తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఖాళీ... వెళ్లిన వారికి వెళ్లినట్టే దర్శనం!

No Rush in Tirumala

  • ఒకే ఒక్క కంపార్టుమెంట్ లో భక్తులు
  • ఎక్కడా ఆగకుండా ఆలయంలోకి 
  • గంటన్నరలోనే దర్శనం

చాలా రోజుల తరువాత తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఖాళీ అయింది. ఈ ఉదయం ఏడుకొండలపై భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. ఉదయం 6 గంటల సమయంలో కేవలం ఒకే ఒక్క కంపార్టుమెంట్ లో భక్తులు వేచి చూస్తున్నారు. వారికి స్వామివారి దర్శనం పూర్తి కావడంతో, వీఐపీ బ్రేక్ తరువాత, దర్శనానికి వెళ్లిన వారు ఎక్కడా ఆగకుండా ఆలయంలోకి ప్రవేశించవచ్చు. సర్వ, దివ్య తదితర అన్ని దర్శనాలకూ ఒకటిన్నర నుంచి రెండు గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. బుధవారం నాడు స్వామి వారిని 68,065 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.

Tirumala
Tirupati
TTD
Piligrims
  • Loading...

More Telugu News