Anupama Parameshvaran: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Anupama Parameshvaran opposite Adharva in a Tamil flick

  • మరో సినిమా ఒప్పుకున్న అనుపమ
  • నితిన్ సినిమాకి టైటిల్ కుదిరింది 
  • పోస్ట్ ప్రొడక్షన్ లో భరణి 'అద్భుతః' 

 *  కొంత కాలం గ్యాప్ తర్వాత కథానాయిక అనుపమ పరమేశ్వరన్ తమిళంలో ఓ చిత్రంలో నటిస్తోంది. అధర్వ హీరోగా ఆర్.కన్నన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో అనుపమ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చెన్నైలో జరుగుతోంది.
*  చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా భవ్య క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి 'చెక్' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారట. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
*  గతంలో 'మిథునం' సినిమాతో దర్శకుడిగా ప్రశంసలందుకున్న ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి తాజాగా 'అద్భుతః' పేరిట మరో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాన్ని పూర్తిచేసిన భరణి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన పనులను నిర్వహిస్తున్నారు.

Anupama Parameshvaran
Adharva
Nithin
Tanikella Bharani
  • Loading...

More Telugu News