Thota Trimurthulu: వైసీపీ నేత తోట త్రిమూర్తులుకు చేదు అనుభవం.. చెప్పుతో దాడికి యత్నించిన వ్యక్తి

Man try to attack Thota Trimurthulu with Chappal

  • ద్రాక్షారామంలో ఘటన
  • మంత్రి మోపిదేవి, వైవీతో కలిసి భీమేశ్వర ఆలయానికి రాక
  • సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి

తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో వైసీపీ నేత తోట త్రిమూర్తులుకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన కారు నుంచి దిగుతుండగా ఓ వ్యక్తి చెప్పుతో దాడిచేసేందుకు ప్రయత్నించాడు. మంత్రి మోపిదేవి వెంకటరమణ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో కలిసి ఈ రోజు మధ్యాహ్నం ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయానికి తోట త్రిమూర్తులు వచ్చారు. ఆయన కారు దిగుతున్న సమయంలో కె.గంగవరం మండలంలోని మసకపల్లికి చెందిన మేడిశెట్టి ఇజ్రాయెల్ చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. క్షణాల్లోనే స్పందించిన తోట భద్రతా సిబ్బంది అతడిని పక్కకు నెట్టేశారు. అయితే, ఆ తర్వాత ఏమైందన్న విషయం తెలియరాలేదు. ఈ ఘటన సోషల్ మీడియాకెక్కడంతో వెలుగులోకి వచ్చింది.

Thota Trimurthulu
YSRCP
Draksharamam
East Godavari District
  • Loading...

More Telugu News