Car Parking: ఇరుకైన స్థలాల్లో కారు పార్కింగ్ చేయడం ఎలా?... వీడియో పోస్టు చేసిన ఆనంద్ మహీంద్రా

Anand Mahindra shares another innovative video

  • సోషల్ మీడియాలో మరో ఆసక్తికర వీడియో పంచుకున్న మహీంద్రా
  • వినూత్నమైన ఆలోచనతో కారు పార్కింగ్ చేసిన వ్యక్తులు
  • అచ్చెరువొందిన పారిశ్రామిక దిగ్గజం

ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేసే పోస్టుల్లో అత్యధికం సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. సరికొత్త ఆవిష్కరణలు, వినూత్నమైన ఆలోచనలకు సంబంధించిన వీడియోలను కచ్చితంగా పోస్టు చేస్తుంటారు.

తాజాగా అలాంటిదో ఓ వీడియోను ఆనంద్ మహీంద్రా పంచుకున్నారు. ఈ వీడియోలో ఇరుకైన స్థలాల్లో కూడా కారు పార్కింగ్ ఎలా చేయవచ్చో చూపించారు. ఓ పార్కింగ్ స్థలంలో ఇనుప చట్రాలతో కూడిన ర్యాంప్ ఉంటుంది. ఆ ర్యాంప్ ను కారు వచ్చే మార్గంలో అమర్చగా, అక్కడికి చేరుకున్న కారు నెమ్మదిగా ర్యాంప్ పైకి చేరుకుంటుంది. ఇద్దరు మనుషులు కారును పక్కకి నెట్టడంతో ఆ ర్యాంప్ తో సహా కారు చక్కగా కొద్దిస్థలంలోనే ఒదిగిపోతుంది. ఈ వీడియోకు ఆనంద్ మహీంద్రా అచ్చెరువొందారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News