Rakesh Master: నటి శ్రీరెడ్డిపై మరో ఫిర్యాదు.... పోలీసులను ఆశ్రయించిన రాకేశ్ మాస్టర్

Tollywood Choreographer Rakesh master complains on Srireddy

  • ఇప్పటికే శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేసిన కరాటే కల్యాణి
  • రాకేశ్ మాస్టర్ పైనా విరుచుకుపడిన శ్రీరెడ్డి
  • సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన రాకేశ్ మాస్టర్

సినిమాల కంటే తన వ్యాఖ్యలతోనే గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీరెడ్డి. ఆమెపై నటి కరాటే కల్యాణి ఫిర్యాదు చేయడం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ కూడా శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు పెడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతకాలం కిందట టాలీవుడ్ లో చోటుచేసుకున్న అవాంఛనీయ పరిణామాల నేపథ్యంలో శ్రీరెడ్డి చెన్నైకి మకాం మార్చింది. ఇటీవల కొంతకాలంగా మళ్లీ తనదైన శైలిలో వ్యాఖ్యలు ప్రారంభించింది. తనను తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతుండడంతో భరించలేకపోయిన రాకేశ్ మాస్టర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.

Rakesh Master
Sri Reddy
Police
Cyber Crime
Tollywood
  • Loading...

More Telugu News