Umar Akmal: ఒక్క పదం తేడాతో నెటిజన్లకు దొరికిపోయిన పాక్ క్రికెటర్

Misfiring tweet from Umar Akmal causes heavy trolling

  • విమానంలో ప్రయాణిస్తూ రజాక్ తో సెల్ఫీ దిగిన ఉమర్ అక్మల్
  • ట్వీట్ కు ఇంగ్లీషులో క్యాప్షన్
  • తప్పు దొర్లడంతో ఉమర్ ను ఆడుకున్న నెటిజన్లు

సభల్లో అమాయకత్వంతో మాట్లాడడం, అజ్ఞానంతో వ్యాఖ్యలు చేయడం, ఏమాత్రం విషయ పరిజ్ఞానం లేకుండా సోషల్ మీడియాలో కామెంట్లు చేయడంలో పాకిస్థాన్ నేతలు ఎంత దిట్టలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు! పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం అందుకు మినహాయింపు కాదు. ఈ కోవలోకే పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ కూడా చేరాడు.

పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో ఆడేందుకు ఉమర్ విమానంలో ప్రయాణిస్తున్నాడు. తన పక్క సీట్లోనే మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ఉండడంతో అతడితో ఓ సెల్ఫీ తీసుకున్నాడు. ఆ సెల్ఫీని ట్విట్టర్ లో పోస్టు చేసిన ఉమర్ అక్మల్ దానికో క్యాప్షన్ కూడా పెట్టాడు. Mother from another brother అంటూ పోస్టు చేశాడు. తామిద్దరం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా సొంత అన్నదమ్ముల్లాంటివాళ్లమేనని ఉమర్ చెప్పదలుచుకున్నాడు.

కానీ ఉమర్ Mother అనే పదాన్ని ముందుకు తీసుకురావడంతో అర్థం తారుమారైంది. వాస్తవానికి ఉమర్ ఇలా రాయాలి... Brother from another mother. కానీ నెటిజన్లు ఊరుకుంటారా..! ఈ పాకిస్థానీ క్రికెటర్ ను ఓ రేంజ్ లో ఆడుకున్నారు. దాంతో నెటిజన్ల విమర్శలు తట్టుకోలేక ఉమర్ తన ట్వీట్ ను  తొలగించాల్సి వచ్చింది.

Umar Akmal
Pakistan
PSL
Abdul Razzak
  • Loading...

More Telugu News