River Yamuna: ట్రంప్ పర్యటన ఎఫెక్ట్: యమునా నదిలో మురికి వాసన పోగొట్టేందుకు చర్యలు!

Water released into river Yamuna to improve its condition

  • భారత్ పర్యటనకు ట్రంప్
  • మురికివాడలు కనిపించకుండా గోడ
  • ఆక్సిజన్ స్థాయులు పెంచేందుకు యమనలోకి నీటి విడుదల

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన పలు నగరాల్లో మార్పులకు కారణం అవుతోంది. అహ్మదాబాద్‌లోని మొతేరాలో మురికివాడలు కనిపించకుండా ఇప్పటికే దారిపొడవునా గోడ కట్టిన అధికారులు.. ఇప్పుడు తాజ్‌మహల్ వద్ద వాతావరణాన్ని మార్చే పనిలో పడ్డారు. అక్కడ కాలుష్యాన్ని పారదోలి వాతావరణలో ఆక్సిజన్ స్థాయులు పెంచేందుకు శ్రమిస్తున్నారు.

ఇందులో భాగంగా తాజ్‌మహల్ పక్కనే ఉన్న యమునా నదిలోకి ఉత్తరప్రదేశ్ నీటిపారుదల శాఖ 500 క్యూసెక్కుల నీటిని విడుదల విడుదల చేసింది. బులంద్‌షహర్‌లోని గంగానహర్ నుంచి ఈ జలాలను యమునలోకి వదిలారు. నీటిని విడుదల చేయడం వల్ల నదిలోని మురుగు వాసన పోవడంతోపాటు నదిలో ఆక్సిజన్ స్థాయులు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు.

River Yamuna
Agra
Donald Trump
Uttar Pradesh
  • Loading...

More Telugu News