Keerthy Suresh: కీర్తి సురేశ్ 'మిస్ ఇండియా' విడుదల తేదీ ఖరారు

Miss India Movie

  • కీర్తి సురేశ్ ప్రధానపాత్రధారిగా 'మిస్ ఇండియా'
  • ముఖ్యమైన పాత్రల్లో జగపతిబాబు .. రాజేంద్ర ప్రసాద్ 
  • ఏప్రిల్ 17వ తేదీన భారీస్థాయి విడుదల  

'మహానటి' తరువాత కీర్తి సురేశ్ తెలుగులో కథానాయికగా కనిపించలేదు. వరుసగా తమిళ సినిమాలు చేస్తూ వెళ్లింది. దాంతో సహజంగానే తెలుగులో గ్యాప్ వచ్చేసింది. తెలుగులో నాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలో ఆమె 'మిస్ ఇండియా' సినిమాను మాత్రమే అంగీకరించి, ఆ సినిమా చేస్తూ వెళ్లింది.

నరేంద్రనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి తాజాగా విడుదల తేదీని ఖరారు చేశారు. ఏప్రిల్ 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాలో జగపతిబాబు .. రాజేంద్ర ప్రసాద్ .. సీనియర్ నరేశ్ .. నవీన్ చంద్ర తదితరులు ముఖ్యమైన పాత్రలను పోషించారు. కొంత గ్యాప్ తరువాత కీర్తి సురేశ్ చేసిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో కీర్తి సురేశ్ ఏ స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

Keerthy Suresh
Jagapathi Babu
Rajendra Prasad
Miss India Movie
  • Loading...

More Telugu News