Motera: ఇంత భారీ స్టేడియాన్ని చూడ్డానికి రెండు కళ్లు చాలవు!

Motera cricket stadium set to inaugurate

  • మొతేరాలో వరల్డ్ నెంబర్ వన్ క్రికెట్ స్టేడియం నిర్మాణం పూర్తి
  • ట్రంప్ పర్యటన సందర్భంగా ప్రారంభోత్సవం
  • 1,10,000 సీట్ల సామర్థ్యం

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అంటే ఇప్పటివరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం (ఎంసీజీ) గురించే చెప్పుకునేవాళ్లు. అయితే భారత్ లోని అహ్మదాబాద్ లో నిర్మితమైన మొతేరా స్టేడియం ఎంసీజీని మించిపోయింది. ప్రపంచంలోనే అతి భారీ క్రికెట్ స్టేడియంగా ఇకపై ఇది నిలవనుంది.

ఎంసీజీ సామర్థ్యం ఒక లక్ష 24 సీట్లు కాగా, మొతేరా స్టేడియం కెపాసిటీ ఒక లక్ష 10 వేల సీట్ల పైమాటే! అద్భుతమైన రీతిలో రూపుదిద్దుకున్న ఈ క్రికెట్ స్టేడియాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా ప్రారంభించనున్నారు. ఈ స్టేడియంలోనే ట్రంప్ 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో పాల్గొంటారు. మొతేరా స్టేడియంలో అత్యాధునిక సీటింగ్ సౌకర్యాలు, పకడ్బందీ డ్రైనేజీ ఏర్పాట్లు ఉన్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News