Puvvada Ajay Kumar: హీరో శ్రీకాంత్ నివాసానికి వెళ్లిన తెలంగాణ మంత్రి పువ్వాడ

TS Minister Puvvada Ajay Kumar meets Hero Srikanth to condole

  • హీరో శ్రీకాంత్ కు ఇటీవల పితృవియోగం
  • అనారోగ్యంతో మరణించిన శ్రీకాంత్ తండ్రి పరమేశ్వరరావు
  • శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

కొన్నిరోజుల క్రితం టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తండ్రి మేకా పరమేశ్వరరావు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన దీర్ఘకాలిక అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో, పితృవియోగానికి గురైన హీరో శ్రీకాంత్ ను తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు. హైదరాబాద్ లోని శ్రీకాంత్ నివాసానికి వెళ్లిన పువ్వాడ అక్కడ కొద్దిసేపు గడిపారు. మేకా పరమేశ్వరరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన తండ్రికి సంబంధించిన వివరాలను శ్రీకాంత్ మంత్రికి తెలియజేశారు.

Puvvada Ajay Kumar
Hero Srikanth
Meka Paramaeshwararao
Tollywood
  • Loading...

More Telugu News