KCR: వైస్ చాన్సలర్ల నియామకాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

CM KCR orders officials to finish VC recruirment quickly

  • వీసీల నియామకం వేగవంతం చేయాలన్న కేసీఆర్
  • ముందు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లను నియమించాలని సూచన
  • రెండు, మూడు వారాల్లో ప్రక్రియ పూర్తవ్వాలంటూ ఆదేశాలు

తెలంగాణలో వివిధ యూనివర్సిటీలకు వైస్ చాన్సలర్లను నియమించే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. వీసీల నియామక ప్రక్రియలో భాగంగా సెర్చ్ కమిటీల నుంచి పేర్లు తెప్పించుకుని, తొలుత ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లను నియమించాలని, తద్వారా వీసీల నియామకం మరింత సులువు అవుతుందని కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ప్రకియ యావత్తు మరో రెండు, మూడు వారాల్లో ముగియాలని స్పష్టం చేశారు.

KCR
Telangana
University
Vice Chancellor
Executive Council Members
  • Loading...

More Telugu News