Nabha Natesh: పారితోషికం ఎక్కువ అడగను .. తక్కువిస్తే తీసుకోను: హీరోయిన్ నభా నటేశ్

Solo Brathuke So Better Movie

  • ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నాను
  • నిర్మాతలను నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టను 
  • ఎంత తీసుకోవాలో తనకి తెలుసన్న నభా నటేశ్  

తెలుగు తెరకి ఈ మధ్య కాలంలో పరిచయమైన బొద్దు గుమ్మలలో నభా నటేశ్ ఒకరు.'ఇస్మార్ట్ శంకర్' తో సక్సెస్ ను అందుకున్న ఈ సుందరిని, 'డిస్కోరాజా' ఫలితం నిరాశపరిచింది. త్వరలో 'సోలో బ్రతుకే సో బెటర్' ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా ఇంటర్వ్యూలో .. పారితోషికానికి సంబంధించిన విషయాన్ని గురించిన ప్రస్తావన రావడంతో తనదైన శైలిలో స్పందించింది.

'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాకి నేను పారితోషికం పెంచేసినట్టుగా .. నిర్మాతలను గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇందులో ఎంతమాత్రం నిజంలేదు. నాకున్న క్రేజ్ కి ఎంత తీసుకోవాలో నాకు తెలుసు .. ఎంత ఇవ్వాలనేది నిర్మాతలకు తెలుసు. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. పారితోషికాన్ని డిమాండ్ చేసే స్థాయికి నేను ఇంకా రాలేదు. పారితోషికం ఎక్కువ అడిగేసి నిర్మాతలను ఇబ్బంది పెట్టను .. అలాగని చెప్పేసి తక్కువ ఇస్తామంటే మాత్రం ఒప్పుకోను" అంటూ తేల్చి చెప్పేసింది.

Nabha Natesh
Sai Dharam Tej
Solo Brathuke So Better Movie
  • Loading...

More Telugu News