Nara Lokesh: కష్టాల్లో ఉన్నవారిని ఆదుకున్నప్పుడు వారి కళ్లలో కనిపించే సంతోషాన్ని వెలకట్టలేం: నారా లోకేశ్

Nara Lokesh tweets over NTR Trust anniversary

  • నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపక దినోత్సవం
  • సేవ ద్వారా వచ్చే ఆనందాన్ని మాటల్లో చెప్పలేమన్న లోకేశ్
  • ట్రస్ట్ చరిత్రలో అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయంటూ ట్వీట్

ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రారంభించి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. ఎన్నో ఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలతో ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రజలకు అండగా నిలుస్తోందని వెల్లడించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ కు సహకారం అందిస్తూ సమాజ హితం కోరి మేము సైతం అంటూ సాయపడుతున్న అందరికీ అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. సేవ చేయడం ద్వారా వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేమని, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేటప్పుడు వారి కళ్లల్లో కనిపించే సంతోషాన్ని వెలకట్టలేమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ చరిత్రలో అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు.

Nara Lokesh
NTR Trust
NTR
Telugudesam
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News