Budda Venkanna: విజయసాయిరెడ్డి ముఖంలో కనిపించినంత టెన్షన్ మీరు జైలుకి వెళ్లినప్పుడు కూడా లేదు: బుద్ధా వెంకన్న

budda venkanna criticises vijay sai reddy and jagan

  • యనమల గారు శాసనమండలిలో మంత్రులకు చుక్కలు చూపించారు
  • 2 రోజుల పాటు మండలి లాబీల్లో కాలు కాలిన పిల్లిలా సాయిరెడ్డి తిరిగారు
  • సాక్షి చూడటం తగ్గిస్తే పగటి కలలు కనే జబ్బు తగ్గుతుంది
  • మీ శాశ్వత నివాసం చంచల్ గూడా జైలుకి వెళ్లడానికి సిద్ధంగా ఉండండి

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. టీడీపీ నేత యనమలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. 'యనమల గారు శాసనమండలిలో రెండు రోజుల పాటు మీ తుగ్లక్ గారికి, 23 మంది మంత్రులకు చుక్కలు చూపించారు. మిమ్మల్ని అయితే మరీ దారుణం! 2 రోజుల పాటు మండలి గ్యాలరీ, లాబీల్లో కాలు కాలిన పిల్లిలా తిప్పారు. ఆ రోజు విజయసాయిరెడ్డి ముఖంలో కనిపించిన టెన్షన్ మీరు జైలు కి వెళ్లినప్పుడు కూడా లేదు సుమీ!' అని విమర్శించారు.

'కేంద్రం మెడలు వంచుతాం అంటూ దొంగ రాజీనామాలు చెయ్యలేదు. కష్టాల్లో ఉన్న రైతుల కోసం పదవీ త్యాగానికి సిద్ధపడ్డాం. కాలం చెల్లింది యనమల గారికి కాదు, సాయిరెడ్డి గారు జగన్ గారి తుగ్లక్ నిర్ణయాలకు కాలం చెల్లింది. పొరపాటున ప్రజల్లో తిరిగే ధైర్యం చెయ్యకండి' అని అన్నారు.
 
'సాక్షి చూడటం తగ్గిస్తే పగటి కలలు కనే జబ్బు తగ్గుతుంది. 2 లక్షలు దొరికాయో, 43 వేల కోట్లు దొరికాయో కోర్టులో తేలిపోతుంది. జగన్ గారితో పాటు మీ శాశ్వత నివాసం చంచల్ గూడా జైలుకి వెళ్లడానికి సిద్ధంగా ఉండండి' అని ట్వీట్ చేశారు.

'ప్రజాచైతన్య యాత్ర అనగానే శుక్రవారం బ్యాచ్ కి వెన్నులో వణుకు మొదలైనట్టు ఉంది. కంగారులో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు పాపం! చంద్రబాబు గారి పీఎస్ ఇంట్లో అటెండర్ గా చేరి ఫోన్ మాట్లాడుతుంటే విన్నారా విజయసాయిరెడ్డి గారు?' అని విమర్శించారు.

Budda Venkanna
Telugudesam
Jagan
Vijay Sai Reddy
YSRCP
  • Loading...

More Telugu News