Chiranjeevi: చిరంజీవిగారు ఎవరినీ నొప్పించరు: దర్శకుడు ముత్యాల సుబ్బయ్య

Hitler Movie

  • చిరంజీవిగారు నన్ను నమ్మారు 
  • రెండు హిట్లు ఇచ్చినందుకు ఆనందంగా వుంది 
  • ఆయన మంచి మనసున్న మనిషన్న ముత్యాల సుబ్బయ్య

కుటుంబ నేపథ్యంలో సాగే కథాకథనాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్యకి మంచి పేరు వుంది. అలాంటి ముత్యాల సుబ్బయ్య .. చిరంజీవి కథానాయకుడిగా 'హిట్లర్'.. 'అన్నయ్య' వంటి సినిమాలను తెరకెక్కించాడు. ఈ రెండు సినిమాలు కూడా భారీ విజయాలను నమోదు చేశాయి.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ,"సెంటిమెంట్ తో కూడిన చిత్రాలను నేను బాగా తీయగలననే నమ్మకంతోనే చిరంజీవిగారు 'హిట్లర్' .. 'అన్నయ్య' సినిమాలను చేసే అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఆ రెండు సినిమాలను హిట్ చేసి, ఆయన నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను. చిరంజీవిగారు గొప్ప ఆర్టిస్ట్ ..ఆయన ఏ పాత్రనైనా అవలీలగా చేయగలరు. ఆయన అందరినీ అభిమానించే మంచి మనసున్న మనిషి. తన తోటి ఆర్టిస్టులను .. టెక్నీషియన్స్ ను బాగా గౌరవిస్తారు. తొదరపడి ఎప్పుడూ ఎవరి మనసును నొప్పించరు. ఎక్కడ కనిపించినా ఆత్మీయంగా పలకరిస్తారు" అని చెప్పుకొచ్చారు.

Chiranjeevi
Muthyala Subbaiah
Hitler Movie
  • Loading...

More Telugu News