Amaravati: పాశుపత హోమం నిర్వహించిన అమరావతి రైతులు

amaravathi farmers asked god to rethink AP CM

  • ఏపీ సీఎం జగన్‌ మనసు మారాలని కోరుతూ యాగం
  • అమరావతి ఏకైక రాజధాని కావాలని డిమాండ్‌
  • 64వ రోజుకు చేరిన ఆందోళన

అమరావతిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా చేసేలా ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి మనసు మార్చాలని కోరుతూ రైతులు ఈరోజు ప్రత్యేక యాగాలు నిర్వహించారు. గడచిన కొన్నాళ్లుగా జరుగుతున్న అమరావతి రైతుల ఆందోళన 64వ రోజుకి చేరింది.
ఇందులో భాగంగా ఈ రోజు నేలపాడులో మాన్యూ పాశుపత హోమం, అఘోర పాశుపత హోమం నిర్వహిస్తున్నారు. అమరావతి మాత్రమే రాజధాని కావాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్‌ చేశారు. రాజధాని కోసం పెనుమాక, ఎర్రబాలెం, కిష్టాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలు, మందడం, తుళ్లూరులో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Amaravati
farmers
yagam
  • Loading...

More Telugu News