Donald Trump: ట్రంప్ ఎఫెక్ట్: మురికివాడల వాసులను ఖాళీచేసి పొమ్మంటూ నోటీసులు !

Trump Affect 45 families in Gujarat slum served eviction notices

  • ఈ నెల 24న మొతేరాలో పర్యటించనున్న డొనాల్డ్ ట్రంప్
  • మురికివాడలోని కుటుంబాలు కనిపించకుండా గోడ కట్టిన అధికారులు
  • ఖాళీ చేయాలంటూ 45 కుటుంబాలకు నోటీసులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన గుజరాత్‌లోని పేదల పీకలపైకి తెచ్చింది. భారత పర్యటనకు వస్తున్న ట్రంప్ ఈ నెల 24న ప్రధాని మోదీతో కలిసి అహ్మదాబాద్‌లోని మొతేరాలో పర్యటించనున్నారు. అయితే, ట్రంప్ ప్రయాణించే దారిలోని మురికివాడలో నివసిస్తున్న 45 కుటుంబాలు కనిపించకుండా ఇటీవల దారిపొడవునా అధికారులు గోడ కట్టారు. ఇది తీవ్ర విమర్శలకు తావిచ్చింది.

 గోడ కట్టడంతో సరిపెట్టని అధికారులు అక్కడి నుంచి ఖాళీ చేయాలంటూ తాజాగా ఆ కుటుంబాలకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న కుటుంబాలు లబోదిబోమంటున్నాయి. తాము దశాబ్దాలుగా అక్కడే నివసిస్తున్నామని, ఇప్పటికిప్పుడు తమను ఖాళీచేయమంటే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. ఈ నోటీసులపై విమర్శలు వెల్లువెత్తడంతో స్పందించిన  అధికారులు ఆ నోటీసులకు, ట్రంప్ పర్యటనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Donald Trump
America
Ahmedabad
Gujarat
Narendra Modi
  • Loading...

More Telugu News