DS: రాజ్యసభ సభ్యుడు డీఎస్‌ను పరామర్శించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్

Union minister PiyushGoyal paid a visit to Dharmapuri Srinivas

  • కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న డీఎస్
  • ఇటీవలే శస్త్రచికిత్స
  • ఆరోగ్య పరిస్థితిపై కేంద్రమంత్రి ఆరా

తెలంగాణ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)ను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నిన్న పరామర్శించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన మంత్రి ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీలో చికిత్స పొందుతున్న డీఎస్‌ను కలిసి ఆరోగ్యంపై ఆరాతీశారు. డీఎస్ కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.

కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న డీఎస్‌కు ఇటీవల వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్న ఆయన కోలుకుంటున్నారు. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న డీఎస్ ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటున్నారు. కాగా, కేంద్రమంత్రి తన తండ్రిని పరామర్శిస్తున్న ఫొటోలను అర్వింద్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

DS
Telangana
Piyush Goyal
Dharmpuri Arvind
BJP
  • Loading...

More Telugu News