Rajasekhar: రాజశేఖర్ సరసన నటించేందుకు ఓకే చెప్పిన శ్రియ!

Shriya is the Heroin in Rajashekhars new movie

  • రాజశేఖర్ తదుపరి చిత్రానికి వీరభద్రం చౌదరి దర్శకత్వం
  • హీరో వయసుకు తగ్గట్టుగా ఉండి, గ్లామర్ చూపించాలని భావించిన దర్శకుడు
  • శ్రియను ఓకే చేసిన డైరెక్టర్

విలక్షణ చిత్రాల్లో నటిస్తూ, తెలుగు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసిన రాజశేఖర్ చేసే తదుపరి చిత్రంలో శ్రియ కథానాయికగా నటించనుంది. 'గరుడవేగ' హిట్ తరువాత రాజశేఖర్ చేసిన 'కల్కి' కలెక్షన్ల పరంగా నిరుత్సాహపరచగా, కాస్తంత గ్యాప్ తీసుకున్న రాజశేఖర్, 'అహ నా పెళ్ళంట', 'పూలరంగడు' సినిమాలకు దర్శకత్వం వహించిన వీరభద్రం చౌదరికి తన తదుపరి సినిమాను అప్పగించారు.

వాస్తవానికి ఓ కన్నడ రీమేక్ లో నటించాలని, దానికి 'సత్య', 'బేతాళుడు' సినిమాల దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తిని తీసుకోవాలని అనుకున్నారట. కానీ కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కకపోవడంతో వీరభద్రం చౌదరికి లైన్ క్లియర్ అయింది.

ఇక ఈ సినిమాలో రాజశేఖర్ వయసుకు తగ్గ గ్లామర్ హీరోయిన్ కావాలని భావించిన దర్శకుడు శ్రియను సెలెక్ట్ చేశారు. ఓ వైపు హుందాగా, మరోవైపు గ్లామర్ నూ ఒలికించే పాత్ర కాబట్టి శ్రియ, న్యాయం చేస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో నటించేందుకు ఆమె కూడా ఓకే చెప్పిందట. కాగా, ఈ వెటరన్ బ్యూటీ, బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ నటించే చాన్స్ కొట్టేసిందన్న సంగతి తెలిసిందే.

Rajasekhar
Shriya
New Movie
  • Loading...

More Telugu News