Oshane Thomos: రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డ విండీస్ ఫాస్ట్ బౌలర్

West Indies fast bowler Oshane Thomos ecapes road accident with minor injuries

  • జమైకాలో రెండు వాహనాలు ఢీ
  • ఆడి కారులో వెళుతున్న థామస్
  • మరో వాహనం ఢీకొనడంతో గాయాలు

జమైకాలో రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో వెస్టిండీస్ యువ ఫాస్ట్ బౌలర్ ఒషేన్ థామస్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. సెయింట్ క్యాథరిన్ లో ఓల్డ్ హార్బర్ సమీపంలో హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో థామస్ కు స్వల్పగాయాలయ్యాయి. అతను నడుపుతున్న ఆడి కారును మరో వాహనం ఢీకొంది. దీంతో గాయాల పాలవడంతో ఆసుపత్రిలో చేరి, చికిత్స అనంతరం తన నివాసానికి వెళ్లాడు.

అయితే, అతడు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. విండీస్ క్రికెట్లో ఎంతో ప్రతిభావంతుడిగా భావిస్తున్న ఈ యువ స్పీడ్ స్టర్ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా, థామస్ రోడ్డు ప్రమాదంలో గాయపడడం పట్ల విండీస్ ఆటగాళ్ల సంఘం స్పందిస్తూ, అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపింది. అన్నట్టు, ఈ రోజు ఒషేన్ థామస్ జన్మదినం!  

Oshane Thomos
Road Accident
Jamaica
St Catherine
West Indies
  • Loading...

More Telugu News